విదేశీ పెట్టుబడి

39. విదేశీ పెట్టుబడి: దేశంలో పెట్టుబడి లోటును విదేశీ పెట్టుబడి తో పూడ్చుకోవాలని సూచిస్తున్నారు. మనం విభిన్నరూపాలలో విదేశీ పెట్టుబడిని చాలా పెద్ద పరిమాణంలో దిగుమతి చేసుకుంటుంన్నాం. విదేశీ పెట్టుబడి యొక్క రాజకీయ అంశాలను మనం ప్రక్కన పెట్టినా దాని ఆర్థిక ప్రయోజనం ఒకానొక పరిమితివరకే వుంటుంది తప్ప అంతకుమించి వుండదు. విదేశీ పెట్టుబడి అంటే మన చేతికి అందే సొమ్ముఅని, మనకు ఉచితమనిపించిన విధంగా దానిని వాడుకోవచ్చుననే భావన ప్రజలలో వుంది. ఇది సత్యంకాదు. విదేశీ పెట్టుబడిని విదేశాలలోనే వాడవలసి వుంటుంది. కనుక అది దేశీయమైన పొదుపు సొమ్ముకు ప్రత్యామ్నాయం కాజాలదు. మనం దేశీయమైన పొదుపు సొమ్ముకు పెటుబడి రూపంలో ఒకానొక పరిశ్రమలో పెడితే దానివల్ల ఆ పరిశ్రమలోని వారికేగాక దాని బయటకూడా ఇతరులనేక మందికి - ఆ పరిశ్రమకు అవసరమైన యంత్రాలను, ఇతర సహాయక ఉ పకరణాలను తయారుచేసే వారికికూడా - ఉపాధి కల్పించిన వారమవుతాం. విదేశీ పెట్టుబడులను మూడువిధాలుగా సంపాదించవచ్చు: (i) వ్యక్తిగత పారిశ్రామికవేత్తలనుంచి (i) అంతర్జాతీయ సంస్థలనుంచి, (iii) విదేశీ ప్రభుత్వాలనుంచి. ఋణాలు అందజేయటం ద్వారాగాని లేక భాగస్వాములవటం ద్వారాగాని వారు ఇది చేయవచ్చు. వారు దేశంలో తమదైన పరిశ్రమ నెలకొల్పవచ్చు లేదా దేశంలోని ప్రభుత్వంతోగాని, ప్రైవేటు పారిశ్రామికవేత్తలతోగాని సహకారపూర్వకంగా పనిచేయవచ్చు. ఈ అన్ని ప్రత్యామ్నాయాల్లోను మౌలికమైన అంశమేమంటే ఏ యంత్రాలకోసం, ఇతర ఉపకరణాలకోసం మనం మన డబ్బును దేశంబయట ఖర్చు పెడుతున్నామో ఆ యంత్రాలు, ఉపకరణాలు మనకు ఉపయోగంగా వుంటాయా అనేది నిర్ణయించేది మనంకాదు. విదేశీ సాంకేతికతను కూడా మనం స్వీకరించవలసి వుంటుంది. విదేశీ సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు తమదేశంలో లభ్యమవుతున్న, ప్రస్తుతం వాడకంలోవున్న ప్రక్రియలతో, యంత్రసామగ్రితో మనదేశంలో వస్తూత్పత్తి చేస్తారు. ఇది కొంతమేరకు పారిశ్రామికీకరణలో తోడ్పడగలదు కానీ దేశానికి దృఢమైన పారిశ్రామిక పునాదిని మాత్రం నిర్మించజాలదు.

Post a Comment

0 Comments