విదేశీ సహాయంపై నియంత్రణ

38. విదేశీ సహాయంపై నియంత్రణ: ఆర్థికరంగంలో మనం స్వావలంబన కలిగివుండటం కూడా ముఖ్యం. మన కార్యక్రమాల సాఫల్యత కోసం విదేశీ సహాయంమీద ఆధారపడితే అది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనకాళ్ళకు బంధంవేస్తుంది. సహాయమందించే దేశాల ఆర్థిక ప్రభావక్షేత్రంలోకిమనం లాగబడతాం. మన ఆర్థిక ప్రణాళికలకు ఇబ్బందులు కలగకుండా కాపాడుకునేందుకై చాలాసమయాల్లో మనం నోరుమూసుకుని పడివుండవలసి రావచ్చు. ఇతరులమీద ఆధారపడే అలవాటు చేసుకున్నదేశం తన ఆత్మగౌరవాన్ని కోల్పోతుంది. అలాంటిదేశం స్వాతంత్ర్యం యొక్క విలువ ఎంతటిదో ఎన్నటికీ గ్రహించజాలదు. అంతేగాక ఏదేశం కూడా మనం సమంజసమని భావించిన రీతిగా వాడుకునేందుకు సహాయం అందించనేదిసత్యం. అది మన ప్రణాళికలను పరిశీలిస్తుంది. మన ప్రయోజనాలకు అనుగుణంగా లేకపోయినా ఆ దేశం కోరేవిధంగా మనం ప్రణాళికలు తయారుచేసుకోవలసి వస్తుంది.

Post a Comment

0 Comments