ఆర్ధిక ప్రజాస్వామ్యం

37. ఆర్ధిక ప్రజాస్వామ్యం: ప్రతి ఒక్కరికీ ఓటు ఆనేది రాజకీయ ప్రజాస్వామ్యానికి గీటురాయి. అయితే, ప్రతి ఒక్కరికీ పని అనేది ఆర్థిక ప్రజాస్వామ్యానికి కొలబద్ద. ఈ పనిహక్కు అనేది కమ్యూనిస్టు దేశాల్లో మాదిరాగా బానిస చాకిరీకాదు. పని అనేది ఒక వ్యక్తికి జీవనోపాధి నివ్వటం మాత్రమేగాక అతను ఎంపిక చేసుకున్నదిగా కూడా వుండాలి. ఆ పనిచేసిన కార్మికుడికి జాతీయాదాయంలో సముచితమైన వాటా దక్కకుంటే అతను నిరుద్యోగిగా పరిగణించబడతాడు. ఈదృక్పథం ప్రకారం ఒక కనీస వేతనం, ఒక న్యాయమైన పంపిణీ వ్యవస్థ, ఏదో ఒకవిధమైన సామాజిక భద్రత అవసరం.

Post a Comment

0 Comments