పాశ్చాత్య ఆర్ధిక వ్యవస్థలమీద ఆధారపడటం

31. పాశ్చాత్య ఆర్ధిక వ్యవస్థలమీద ఆధారపడటం: విభిన్నమైన జీవనాదర్శాల కారణంగానే కాక, దేశ, కాలాలకు సంబంధించిన విభిన్న పరిస్థితుల కారణంగా కూడా మన ఆర్ధిక విధానాలు పాశ్చాత్యుల ఆర్థిక విధానాలకు భిన్నంగా వుండాల్సిన అవసరముంది. కాని మనం మార్షలకు,మార్క్కు అంటిపెట్టుకొనివున్నాం. వారు చర్చించిన ఆర్ధిక సూత్రాలు శాశ్వతమైనవని మన నమ్మకం. తాము కొన్ని వ్యవస్థలమీద ఆధారపడి వున్నామని గ్రహించినవారు కూడా తమ కక్ష్యలను దాటి రాలేకపోతున్నారు. పాశ్చాత్యుల ఆర్ధిక సుసంపన్నత మనలో వారి ఉత్పాదక వ్యవస్థపట్ల ఒక గ్రుడ్డి నమ్మకాన్ని సృష్టించింది. పాశ్చాత్య ఆర్థికవేత్తలు పుంఖాను పుంఖాలుగా సృష్టించిన విమర్శనాత్మక సాహిత్యం చూసి మనం సులభంగా న మ్మోహితుల వై పోతున్నాం. దాని నుంచి పైకి రాలేకపోతున్నాం. ఈ ఆర్థిక విజ్ఞాన శాస్త్రంలో దేశ, కాలాల మీదగాని, వ్యవస్థమీదగాని ఆధారపడని కొన్ని సూత్రాలు ఉ ంటే ఉండవచ్చు, అవి అందరికీ ఉపయోగ పడనూవచ్చు, కాని ఈ గుణాన్ని మదింపు చేయగల సామర్ధ్యం వున్నవారు దాదాపుగా లేరనే చెప్పవచ్చు. అలాంటి సామర్థ్యం గలవారిని మన విద్యావ్యవస్థ తయారుచేయదు. మన ఆర్ధికవేత్తలు పాశ్చాత్య ఆర్థిక శాస్త్రంలో నిపుణులైతే కావచ్చు, కాని దానికి తమదైన గట్టి అంశదానం (contribution) చేయలేకపోయారు. కారణమేమంటే అందుకు అవసరమైన ఆలోచననుగాని, ప్రయోగం చేయడానికి కావలసిన క్షేత్రాన్నిగాని భారతీయ ఆర్థికవ్యవస్థ వారికి ఇవ్వజాలదు.

Post a Comment

0 Comments