స్వదేశీ - వికేంద్రీకరణ

30. స్వదేశీ - వికేంద్రీకరణ: ప్రస్తుత పరిస్థితులకు అనువైన ఆర్థిక విధానాన్ని "స్వదేశీ”, “వికేంద్రీకరణ" అనే రెండుపదాలు సంక్షిప్తంగా తెలియజేస్తాయి.
తెలిసో, తెలియకో ఇన్నేళ్ళుగా కేంద్రీకరణ, గుత్తాధిపత్యం పరిపాటి అయిపోయాయి. ప్రణాళికలు రూపొందించేవారు భారీస్థాయి కేంద్రీకృత పరిశ్రమ మాత్రమే సరియైన ఆర్ధిక విధానమనే నమ్మకానికి బందీలైనారు. అందువల్ల దాని దుష్పలితాల గురించి పట్టించుకోకుండా, తెలిసీ నిస్సహాయంగా ఆ దిశగానే సాగిపోయారు. “స్వదేశీ” విషయంలోనూ ఇలాగే జరిగింది. స్వదేశీ భావనను పాతకాలపు పద్ధతి అనీ, ప్రతిక్రియాత్మకమనీ అవహేళన చేశారు. ఆలోచించటం, నిర్వహణ, పెట్టుబడి, ఉత్పాదన పద్దతులు, సాంకేతికత ఇత్యాదుల నుంచి మనం విదేశీ సహాయాన్ని వినియోగించుకుంటున్నాం. పురోగతికి, అభివృద్ధికి ఇది దారికాదు. మనం మన వ్యక్తిత్వాన్ని మరచిపోయి మళ్ళీ బానిసలమవుతాం. “స్వదేశీ” సానుకూల భావనను మన ఆర్ధిక వ్యవస్థ పునర్ నిర్మాణానికి కీలకాంశంగా వినియోగించుకోవాలి.

Post a Comment

0 Comments