3.నాగరిక జీవనానికి మౌలికమైనది ధర్మం: మనం ధర్మాన్ని విశ్వసించడానికి కారణం అది అర్ధ సముపార్జనకు సాధనం అవటం మాత్రమేకాదు, నాగరిక జీవితపు మౌలిక సూత్రం అయినందువల్లకూడాను. కామాన్ని కూడా ధర్మం ద్వారా మాత్రమే సాధించ గలుగుతాం. మంచి ఆహారం వంటి భౌతిక వస్తువులను ఉత్పాదన చేసిన మీదట వాటిని ఎప్పుడు, ఎక్కడ, ఏవిధంగా,ఏమేరకు వినియోగించాలో నిర్ణయించగలిగేది ధర్మం మాత్రమే. ఆరోగ్యవంతుడికి ఉద్దేశించిన ఆహారాన్ని వ్యాధిగ్రస్తుడు తిన్నా, లేక వ్యాధిగ్రస్తుడు తినాల్సిన ఆహారాన్ని ఆరోగ్యవంతుడు తిన్నా వారిద్దరికీ నష్టమే. మనిషి తన సహజ ప్రవృత్తులను అదుపు చేసుకొని తనకు ప్రియాన్ని చేకూర్చే దానికి బదులుగా శ్రేయస్సును కలిగించేదేదో నిర్ణయించు కోవడానికి ధర్మం సాయపడుతుంది. కనుకనే ధర్మానికి మన సంస్కృతిలో సర్వోచ్చ స్థానాన్ని యిచ్చారు.
0 Comments