సంపన్నత - ధర్మం

4. ఆర్ధిక విషయాలు
29. సంపన్నత - ధర్మం: భౌతిక సంపద లేకపోవటం మాత్రమే కాదు, భౌతిక సంపద మితిమీరి వుండటం కూడా ధర్మనాశనానికి దారితీస్తుంది. ఇది ఈ దేశపు దృక్పధంలోని విశేషమైన అంశం. భౌతిక పరిణామం గురించి పాశ్చాత్య ప్రపంచం ఆలోచించలేదు. ఈ సాధనాలవల్ల వాటిపట్ల గాని లేక వాటిద్వారా లభించే విషయాలు, ఆనందాలపట్లగాని వ్యసనం ఏర్పడితే అప్పుడు భౌతిక ప్రభావం స్థిరపడినట్లు చెప్పవచ్చు. భౌతిక సంపద లేనప్పుడు అది సాధనంగా వుండటంమాని అదే ఒక లక్ష్యమవుతుంది. అది మరీ ఎక్కువగా వున్నపుడు ధార్మిక వర్తనకు సాధనంగా వుండటంమాని ఇంద్రియ సుఖాలకు సాధనమవుతుంది. ఈ సుఖాలకు అంతు అంటూ వుండదు గనుక వీటికి అలవాటుపడ్డ మనిషి ఎప్పుడూ సంపద చాలటం లేదనే భావనతో వుంటాడు. అదే సమయంలో అతని సుఖాల వ్యసనం సంపదను ఉత్పాదన చేయగల అతని సామర్ధ్యాన్ని తగ్గించివేస్తుంది.

Post a Comment

0 Comments