మన మూలాలను కాపాడుకోవాల్లి

28. మన మూలాలను కాపాడుకోవాల్లి: స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా దేశంలో ప్రాణశక్తి కనిపించటంలేదెందుకు? పేదరికం, ఆకలిబాధ, నిరుద్యోగం, నిస్సహాయభావన పెరిగిపోతున్నాయెందుకు? జాతీయశీలం దిగజారిందేందుకు? ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాహిత్యాది అన్ని రంగాలలో నిరంతరాయమైన పతనం కనిపిస్తున్నదేమి? జాతీయజీవనం అగమ్యగోచరంగా కొట్టుమిట్టాడుతున్నదెందుకని? మనమెందుకు ఇలా అయోమయస్థితిలో వున్నాం? మన కాళ్ల మీద మనం నిలబడక పోవటమే నిస్సందేహంగా దీనికంతటికీ ఏకైకకారణం. సమూలంగా నేలకూలిన చెట్టు జలప్రవాహంలో పడి నిస్సహాయంగా కొట్టుకుపోయినట్లు తన మూలాలు పోగొట్టుకున్నవాడు సహజంగానే కొట్టుకుపోతాడు. మన జాతీయ జీవనం యావతు తన మూలాలను పోగొట్టుకుంది. ఈ పతనాన్ని అరికట్టడానికి ఒకే ఒక సాధనం జాతీయ జీవనం గురించిన యధార్ధమైన అవగాహన, విశు దమైన జాతీయతా భావన లేనందువల్ల జాతీయాభివృద్ధి సాధ్యం కాకపోవటం మాత్రమేగాక స్వాతంత్ర్యం కూడా కోల్పోవచ్చు. జాతియొక్క యుగయుగాల చరిత్రలో అభివ్యక్తమైన జాతీయ వాదపు చైతన్యాన్ని మనం విస్మరించి నందువల్లనే మనకీ దుర్దినాలు ప్రాప్తించాయి. ఈ గోతిలో నుంచి మనం బయటపడాలంటే జాతికి ఆధారభూమికమైన మనోభావన ఏమిటో మనం స్పష్టంచేయాలి. జాతీయ ఆదర్శాలు, ఆకాంక్షల మూలాలను బలోపేతం చేసుకుంటే ఒక ప్రబలశక్తిని సృష్టించవచ్చు. జాతీయత అంటే ఏమిటో యధార్ధమైన అవగాహన వుంటే జాతీయ జీవితపు ఆశయాన్ని అర్ధం చేసుకోగలుగుతాం. అటుపైన జాతి ప్రాణశక్తితో తేజరిల్లుతుంది. - జాతీయత గురించిన ఈ యధార అవగాహన లేకపోవటమే ఒక జాతిగా మన ప్రస్తుత పతనానికి మౌలికమైన కారణం.

Post a Comment

0 Comments