జాతీయవాదం VS మతం

26. జాతీయవాదం VS. మతం: ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులవంటి అనేక విభిన్న వర్గాలున్నాయని, వాటన్నిటి వ్యక్తిగత అస్తిత్వాన్ని పరిరక్షించడం ద్వారా మాత్రమే జాతీయవాద భావనను సృష్టించగలమనే ఆలోచనను బ్రిటీషువారి పాలనాకాలంలో మనం అంగీకరించాం. వాస్తవానికి వాటి వ్యక్తిగత అస్తిత్వాన్ని జాతీయస్థాయిలో అంగీకరించటం ఒక పెద్ద పొరబాటు. ఎందుకంటే మతం ప్రాతిపదికన ముస్లింలు, క్రైస్తవులవంటి వర్గాలుగా సమాజాన్ని వర్గీకరించటం జాతీయవాదానికి భిన్నమైనది. ఒకే మతానికి చెందినవారు వివిధ దేశాల జాతీయులుగా వుండవచ్చును. కాగా ఒకే జాతిలో అనేకమతాల అనుయాయులు చేరివుండవచ్చును. జాతీయవాదం తగినంత బలమైన మనోభావనగా వుంటే అందులోకి మతం ప్రవేశించదు. కాని ఈనాడు సమైక్యత కోసం ఎవరు ఏమీ త్యజించవలసిన అవసరంలేకుండా ఈ వర్గాల స్వతంత్ర అస్తిత్వాన్ని అంగీకరించి, ఆపైన వారిని సమైక్యపరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తమాషా ఏమంటే అందరినీ ఒకటిగా చేర్చే సమైక్యతా మూలకం ఏమిటో ఎవరికీ ఒక స్పష్టమైన భావన లేదు.

Post a Comment

0 Comments