జాతీయ వైభవ సాధనకు నిబంధనలు

24. జాతీయ వైభవ సాధనకు నిబంధనలు: మన జాతిని వైభవ శిఖరాలకు చేర్చాలంటే మనం రెండు నిబంధనలను నెరవేర్చవలసి వుంటుంది. మొదటిదేమంటే మనదైన జాతీయ కృషి ఫలితంగానే ఈ వైభవం సిద్ధించాలి. దీనికోసం మొత్తం జాతి యొక్క పని సామర్థ్యాన్ని సంఘటితం చేయాలి. ఈ నిబంధనను మనం నెరవేరిస్తే భారత్ కోసం మనం సాధించే సుసంపన్నత నికార్సయినదిగా పరిగణించ బడుతుంది. రెండో అంశమేమంటే సంఘటిత సామర్ధ్యం ప్రాతి పదికగా ఈ సుసంపన్నతను సాధించేటపుడు ధర్మ పరిరక్షణ కూడా జరగాలి. సంఘటిత శక్తి ఒక్కటే సరిపోదు. దొంగలకు కూడా బలమైన సంఘటన వుంటుంది; కాని అది శాశ్వతమూ కాదు, శ్రేయోదాయకమూ కాదు; కనుక మన సంఘటిత సామర్ధ్యం వైభవ విజయసాధనాక్రమంలో ధర్మపరిరక్షణ చేయాలి.

Post a Comment

0 Comments