జాతికి గీటురాయి 'చితి' ( జాతీయాత్మ)

20. జాతికి గీటురాయి 'చితి' ( జాతీయాత్మ): ప్రతి చర్యను, ప్రతి వైఖరిని పరీక్షించి అది ఆమోద యోగ్యమా, కాదా అనేది తేల్చే గీటురాయి చితి'. జాతి యొక్క ఆత్మయే చితి'. ఈ చితి’ యొక్క బలం మీదనే ఒక జాతి శక్తివంతంగా, పౌరుషోపేతంగా ఉన్నతి నందుకుంటుంది. ఒక జాతి యొక్క ప్రతి మహాపురుషుని చర్యలలో ప్రదర్శితమయ్యేది ఈ ‘చితి'యే. జాతి ఆత్మ అయిన ‘చితి'ని అభివ్యక్తం చేయడంలో వ్యక్తి కూడా ఒక సాధనమే. కనుకనే ఒక వ్యక్తి తనకేగాక తన జాతికి కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. అంతేకాదు, జాతి లక్ష్యాన్ని నెరవేర్చడానికి సృష్టించబడిన వివిధ సంస్థలకు కార్యకర్తగా పనిచేసేది కూడా అతడే. కనుక వీటికి కూడా అతడు ప్రాతినిధ్యం వహిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే ఒక వ్యక్తికి బహుముఖీన పాత్ర లుంటాయి; కాని వాటిమధ్య ఘర్షణ వుండదు; సహకారం, సమైక్యత, సామరస్యం వుంటాయి. ఏవ్యవస్థ అయితే మానవాళి యొక్క విభిన్న ఆదర్శాలలోని ఈ పరస్పర పరిపూరక స్వభావాన్ని, వాటి అనివార్య సామరస్యాన్ని గుర్తించడం మీద ఆధారపడి వుంటుందో, ఏవ్యవస్థ వాటి వైరస్యాన్ని (disharmony) తొలగించి వాడి పరస్పర ప్రయోజకత్వాన్ని, సహకారాన్ని ఇనుమడింపజేసేది వుంటుందో అది మాత్రమే మానవాళికి శాంతి సౌఖ్యాలను సమకూర్చగలుగుతుంది; స్థిరమైన అభివృద్ధికి దోహద పడగలుగుతుంది.

Post a Comment

0 Comments