19. జాతికీ ఆత్మవుంది: _ఇక జాతికి కూడా ఆత్మ వుంటుంది. దీనికి 'చితి' అనే సాంకేతికమైన పేరువుంది. ఇది ఒక సమూహంయొక్క సహజసిద్ధ స్వభావమని మెక్డౌగల్ అంటాడు. ప్రతి వ్యక్తుల సమూహానికీ ఒక సహజ స్వభావమున్నట్లే ప్రతి సమాజానికి కూడా ఒక సహజ స్వభావం వుంటుంది. అది చారిత్రక పరిస్థితుల పరిణామం మాత్రం కాదు. చితి జాతికి మౌలికమైనది, జాతి ప్రారంభ కాలం నుంచి దానికి కేంద్ర బిందువుగా వుండేది కూడాను. జాతి సాంస్కృతికంగా పురోగమించవలసిన దిశను నిర్ణయిస్తుంది చితి. చితికి అనుగుణంగా వుండేదంతా సంస్కృతిలో చేర్చబడింది.
0 Comments