జాతి శరీరం

18. జాతి శరీరం: ఏవో స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి జాతి ఏర్పడదు. మానవ శరీరంలోని అవయవాలకు వాటి సహజ ధర్మాలుంటాయి. ఆ పనులు నెరవేర్చడానికై వాటిని ప్రలోభపెట్టవలసిన, లేక ప్రోత్సహించవలసిన అవసరంలేదు.
అదే విధంగా ఒక జాతి యొక్క విభాగాలన్నీ ఒకే సమిష్టియోక్క అంగాలుగా పనిచేస్తూ దాని అస్తిత్వాన్ని నిలుపుతాయి. జాతీయభావన విచ్చిన్నమైతే జాతియొక్క ఈ అంగాలు బలహీనపడతాయి. అవి పూర్తిగా అచేతనమైతే దాని ఫలితం జాతి వినాశమే. ఈ అంగాలలో జాతీయ భావనను మేల్కోల్సితే అవి మరల తమ సహజ కర్తవ్యాలను నిర్వర్తించటం మొదలుపెడతాయి. కనుక మనం ఒక స్థిరమైన, పటిష్ఠమైన, స్వావలంబనకలిగిన, ఒక ఆచరణశీలమైన సహజ వ్యవస్థను జాతికి ప్రాతిపదికగా స్వీకరించవలసి వుంటుంది. రాజ్య వ్యవస్థ తగినంత బలోపేతంగా వుంటే దాని అవయవాలు కూడా అంతే బలోపేతంగా వుంటాయి.

Post a Comment

0 Comments