ఒకే సంస్కృతి

10. ఒకే సంస్కృతి: - భారత్లో ఒకే సంస్కృతి మాత్రమే విలసిల్లగలదు. బహుళ సంస్కృతుల నినాదం ఈ దేశాన్ని ముక్కలుగాచేసి నాశనం చేయగలదు. కనుక ముస్లింలీగ్ వారి రెండు సంస్కృతుల సిద్ధాంతం, కాంగ్రెసువారి ప్రచ్ఛన్న రెండుసంస్కృతుల సిద్ధాంతం, కమ్యూనిస్టుల బహుళ సంస్కృతుల వాదం తప్పుడు సిద్దాంతాలు. ఇప్పటి వరకు ఏక సంస్కృతీ సిద్ధాంతం కమ్యూనలిజంగా నిరసనకు గురియైంది. అయితే ఇప్పుడు కాంగ్రెసులోని పండితులు కూడా తమ పొరపాటు గ్రహించి ఒకే సంస్కృతి సిద్ధాంతాన్ని ఆమోదిస్తున్నారు. ఒకే సంస్కృతి అనే ఈ భావన మాత్రమే భారతదేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షించి మన సమస్యలనన్నింటిని పరిష్కరించ గలుగుతుంది.

Post a Comment

0 Comments