వ్యాపారులు ప్రాధాన్యం

వ్యాపారులు ప్రాధాన్యం
చిన్న, పెద్ద వ్యాపారులపెట్టుబడులు ఉన్న వారు రాజ్యానికి అలంకారం వంటి వారు. వారి వల్ల రాజ్యం విలువ పెరుగుతుంది. రాజ్యంలో ఉత్పత్తి కాని అన్ని వస్తువులను వారు సరఫరా చేస్తారు. కష్టకాలంలో లేదా అత్యవసర పరిస్థితిలో వారు రాజ్యానికి అవసరమైన వస్తువులను సరఫరా చేయ గలరు. క్లిష్ట సమయంలో తమ సంపదను వారు రాజ్యానికి అందచేయడం ద్వారా దాన్ని రక్షించగలుగుతారు. దీని వల్ల రాజ్యం క్లిష్ట పరిస్థితులను అధిగమించగలుగుతుంది. కాబట్టి తన రాజ్యంలో వ్యాపారులను కాపాడటం రాజుకు చాలా శ్రేయో దాయకం.
రాజ శాసనం తొమ్మిది

Post a Comment

0 Comments