5


 యూరప్, అరేబియాలనుంచి చాలా మంది వాణిజ్యంచేసేవారు, వ్యాపార చేసేవారు ఇక్కడికి వస్తూంటారు. వారు తమదైన విభిన్నమైన తలపాగాలు ధరించి ఉంటారు. ఆలాంటి వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తల కార్యకలాపాలను నియంత్రిస్తూ ఉండాలి. వారు తమ వస్తువులను అమ్మే చోటు వరకే వారికి ప్రవేశాలకు ఉండాలి. ఇక్కడ శాశ్వతంగా ఉండేందుకు వారికి అనుమతిని ఇవ్వకూడదు. రేవుల్లో, ఇతర ప్రదేశాల్లో యథేచ్చగా తిరిగేందుకు కూడా వారికి అనుమతి ఉండకూడదు. వారికి నది ఒడ్డున, సముద్ర తీరంలో భూమిని కేటాయించకూడదు. ఎందుకంటే వారు కోటలను నిర్మించవచ్చు. వాటి రక్షణ కోసం నౌకా సైన్యాన్ని తయారు చేసుకోవచ్చు. తరువాత ఆ భూమిపై అధికారాన్ని జమాయించుకోవచ్చు, ఒకసారి విదేశీయులకు భూములను ఇస్తే రాజ్యం వాటిని కోల్పోతుంది. వారి నౌకా దళాల వద్ద మందుగుండు, ఆయుధ సామగ్రి పుష్కలంగా ఉంటుంది. ఒక వేళ వారికి భూమి కేటాయించాలంటే అది సముద్ర తీరానికి దూరంగా ఉండాలి. రెండు మూడు పెద్ద నగరాల మధ్య ఉండాలి, అలా ఇచ్చిన భూమి లోతట్టు ప్రాంతమై ఉండాలి. దగ్గర్లో ఉన్న పట్టణాల నుంచి దానిని నియంత్రించగలిగి ఉండాలి. విదేశాల నుంచి వచ్చే వ్యాపారులు ఇక్కడి పౌరుల జీవన విధానాన్ని దెబ్బతీయకుండా చర్యలు తీసుకోవడం అవసరం. బయటి నుంచి వచ్చిన వ్యాపారులు. ఫ్యాక్టరీలు, ఉత్పాదనా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ శాశ్వత నివాసాలను. ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిని ఇవ్వరాదు. వారు ఈ నియమనిబంధనలను పాటిస్తే మంచిది. అలా పాటించని వారు మనకు అవసరం లేదు. వారు - అప్పుడప్పుడూ వచ్చిన, మనలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయని పక్షంలో మనం కూడా వారిని ఇబ్బందుల పాలు చేయకూడదు.
రాజ శాసనం ఐదు 

Post a Comment

0 Comments