వేతనాలు, బహుమతులు

వేతనాలు, బహుమతులు

రాజ్యంలోని ఉద్యోగులందరికీ తగినంతగా వేతనాలు ఇవ్వాలి. ఇది సంకుచిత ధోరణులకు అతీతంగా జరగాలి. ఒకరిద్దరు ఉద్యోగులు చాలా బాగా పనిచేసినా లేక వారి ఇళ్లలో ఏవైనా సమస్యలు ఉన్నా వారికి బహుమానాలు ఇవ్వాలి లేదా సహాయం అందించాలి. కానీ వేతనం విషయంలో వివక్ష ఉండకూడదు. ఒకే స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎవరైనా అత్యద్భుతమైన రీతిలో పనిచేస్తే ఆయనకు కేవలం వేతనం పెంచడం కాకుండా, బహుమతిని ఇవ్వాలి. ఒకరి జీతం మాత్రమే పెంచితే మిగతా వారిలో కూడా తమకూ జీతం పెంచాలన్న కాంక్ష పెరుగు తుంది. అలా చేయని నాడు అసంతృప్తి పెరుగుతుంది. చివరగా ఒకరికి ప్రత్యేక కారణాల వల్ల జీతం పెంచినట్టయితే మిగతావారికి కూడా జీతం పెంచాల్సి వస్తుంది. లేని పక్షంలో లబ్దిపొందని వారిలో అసంతృప్తి పెరిగి అనవసర వివాదాలు మొదలవుతాయి. ఇది అంతిమంగా రాజ్య పాలనా వ్యవస్థను బలహీనపరుస్తుంది. అది చివరికి రాజ్యం ముక్కముక్కలయ్యే పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఉద్యోగి నిజంగా అత్యద్భుతంగా పనిచేస్తే అదనికి పదోన్నతిని కల్పించాలి. దీనికి ఎవరి అభ్యంతరమూ ఉండదు. ఎవరి లోనూ అసంతృప్తి కలిగే పరిస్థితి ఉండదు. నిజానికి ఇది వారిని కూడా కష్టపడి పనిచేసేలా, తద్వారా తామూ పదోన్నతి పొందేలా ప్రోత్స హిస్తుంది. వేతననిర్ధారణ ఎప్పుడూ పాలనా యంత్రాంగపు నియమావళి ఈ మేరకే జరగాలి. బహుమతులు మాత్రం వారి పని ప్రమాణాం, దాని నాణ్యత ఆధారంగా జరగాలి.
రాజ శాసనం పదమూడు

Post a Comment

0 Comments