నీటిని పాకిస్తానుకు విడుదల


మన దేశంలోని పంటలు నీరు లేక ఎండిపోతూ ఉంటే, ఉదారంగా కాలువ నీటిని పాకిస్తానుకు విడుదల చెయ్యాలి అనీ, ప్రతి ఒక పైసను రక్షణ నిమిత్తం పొదుపు చేయవలసిన సమయంలో కోట్లాది రూపాయలు పాకిస్తాన్‌కు చెల్లించాలనీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఆర్ధిక సహాయం కోసం మనం ఆధారపడిన ప్రపంచ బ్యాంకే మనపై ఈ ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిడికి మనం లొంగిపోయాం. బిచ్చగాళ్ళకు ఎంచుకొనే హక్కులేదు. ఋణగ్రస్తులూ అంతే. ఇది మన విషయంలో అక్షరాలా నిజమైంది. ఇన్నేండ్లుగా మన ఆర్థిక స్థితిని ఆత్మనిర్భరం చేసుకోవటంలో చూపిన అశ్రద్ధకు మనం చెల్లించిన వెల యిది. తిండి, డబ్బు-ఇంకా ప్రతిదీ అడుక్కుతినే అలవాటు సంవత్సరాలుగా ఏర్పడింది. జాతీయ స్వాతంత్య్ర గౌరవాలను నిలబెట్టుకొనేందుకు అడ్డుదారులు లేవనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరు కునేందుకుగాను ప్రతి జాతి ఆత్మ నిర్భరత, ఆత్మ సమర్పణల కఠోర మార్గాన పయనించి తీరాలి.
                                                                                                       ---మాధవ సదాశివ గోళ్వల్కర్‌ (గురూజీ)

Post a Comment

0 Comments