అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం పాట వింటే ఒళ్ళు పులకరిస్తుంది... ayodhya ram mandir song

అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట పాట వింటే ఒళ్ళు పులకరిస్తుంది... ఈ పాటను రచయిత శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి కొర్శిపాటి గారు వ్రాశారు. పాడిన వారు రాము గారు నెల్లూరు... అందరూ వినండి శేర్ చేయండి.

అదిగదిగదిగో అయోధ్యా పురి రఘుకుల తిలకుడు ఏలిన నగరి
అక్షింతలతో ఆహ్వానించి ఆరంభమునకు రారమ్మన్నది
"అదిగదిగదిగో అయోధ్యాపురి"

అయిదు శతాబ్దుల పోరాటానికి మౌన సాక్షిగా నిలచినది
రామభూమికై అశువులు బాసిన వీరుల త్యాగ ఫలము ఇది
గణగణగణగణ జగమంతటికీ చాటెను అదిగో హైందవ శౌర్యం
ఆ ఘన గర్జనె పునాది కాగా ఆకృతి దాల్చెను భవ్య మందిరం
కోదండ రాముని దివ్య మందిరం
"అదిగదిగదిగో అయోధ్యాపురి"

పుష్యమాసమున శుక్ల పక్షమున ద్వాదశి ఘడియల ప్రతిష్ఠ పర్వం
వేయి కళ్ళతో వేచియున్నది ఆ వేడుకకై లోకం సర్వం
హారతులతొ పత్యక్ష వీక్షణతొ గుండె గుండె ఒక గుడిగా మారగ
సాత్విక శక్తి జాగరణముకై విజయ మహా మంత్రాన్ని పఠిద్దాం
విశ్వ కళ్యాణ కారకులవుదాం...
"అదిగదిగదిగో అయోధ్యాపురి"

అవమానాలను మరువని జాతికి అపజయమన్నది లేనేలేదని
విరామమెరుగక పోరిన జనతకు శాశ్వత విజయం తథ్యమని
శిరమునెత్తుకుని హిందు సమాజం సగౌరవంగా చాటెను జగతికి
నవ్య సనాతన భారతావని నాంది పలికినది నవ శకానికి
పునాదిరా ఇది విశ్వ హితానికి

అదిగదిగదిగో అయోధ్యా పురి రఘుకుల తిలకుడు ఏలిన నగరి
అక్షింతలతో ఆహ్వానించి ఆరంభమునకు రారమ్మన్నది
అదిగదిగదిగో అయోధ్యాపురి...


Post a Comment

0 Comments