కాకి కాకే హంస హంసయే

ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢ;
ధన రహితాస్తు బుధా ప్రయాంతు పద్భ్యాం 
గిరి శిఖర గతాపి కాక పంక్తి:
పులిన గతై: న సమత్వ మేతి హంసై:
అర్థము:- లోకమున విద్యా సంస్కార హీనులైన వారెందరో గజములు, గుర్రములు కట్టిన రథాలలో అత్యంత వైభవముగా ప్రయాణిస్తుంటారు. మహా పండితులు,పరమయోగ్యు లయిన ధార్మిక పురుషులు ఎందరో నిరుపేద లగుట  చేత పాదచారులై పోతుంటారు. కాకులు పర్వత శిఖరమున బారులు తీరి కూర్చున్నంత మాత్రమున క్రింద సరస్సులో విహరించు చున్న హంసలతో సాటి రాగలవా? ఇప్పుడు లోకములో అదే జరుగుతున్నది కదా!సంస్కార హీనులు,విద్యా హీనులు గద్దెనెక్కి పరిపాలిస్తున్నారు, సమర్ధులైన విద్వాంసులు,ధార్మికు లయినవారు ధనము,అధికారము లేక బాధ పడుతున్నారు. 'కాకి కాకే హంస హంసయే'

Post a Comment

0 Comments