ఇంతకూ ఆ అధికారి ఎవరో తెలుసా ? - bruyat

ఈశాన్య రాష్ట్రాలనుండి ఒక స్వయంసేవక్ నాగపూర్ లో జరగబోయే సంఘ తృతీయవర్షలో పాల్గొనడానికి వచ్చాడు. ఆటో దిగి వర్గ స్థలంలోకి అడుగులేస్తున్నాడు. అతడి చేతుల్లో లగేజ్ ఎక్కువగా ఉండటం , దూరంగా ఉన్న ఒక సంఘ స్వయంసేవక్  చూశాడు. వెంటనే అతడికి ఎదురేగి , అతడి చేతుల్లోనుండి కొంత సామాను తీసుకుని వసతిగది వరకూ అతడితోబాటు నడిచారు. 
      మరునాటి ఉదయం సంఘశిక్షావర్గ ఉద్ఘాటనా కార్యక్రమం. అందులో ఉపన్యాసమివ్వడానికి వేదిక మీదకు వచ్చిన సంఘ అధికారిని చూసి , నిన్నటి రోజున తన చేతిలోని లగేజిని ఇచ్చిన శిక్షార్థి హడలిపోయాడు. ఎందుకంటే స్వయంసేవక్ లగేజ్ ను మోసుకుని వసతిగదికి తీసుకొచ్చిన వ్యక్తి ,ఈ రోజు ఆ కాలాంశం తీసుకోవడానికి వచ్చిన వ్యక్తి ఒకరే. 
         కాలాంశం పూర్తయిన తర్వాత ఆ శిక్షార్థి ఆ అధికారిని కలిసి , మీరు ఇంత పెద్ద బాధ్యతలో ఉండి కూడా నా లగేజ్ ను ఎందుకు మోసుకొచ్చారు? నా లగేజ్ మీకు ఇవ్వటం నా పొరబాటు అన్నాడు. 
       అపుడు ఆ అధికారి , నీకు సహాయం చేయటానికి వచ్చినపుడు నేను మరే ఇతర పనిలో లేను , ఖాళీగా ఉన్నాను. అందుకే సహకరించాను. ఇందులో తప్పేమీ లేదుగదా ! అన్నారు. మళ్ళీ , మీరు ఎక్కువ లగేజ్ తో రావటం చూసి సహాయం చేయడానికి వచ్చానంతే ! అన్నారాయన. 

     ఇంతకూ ఆ అధికారి ఎవరో తెలుసా ? 
 అప్పటికి సర్ కార్యవాహ గా ఉన్న మాననీయ బాలాసాహెబ్ జీ దేవరస్.

(2019 లో అఖిల భారతీయ ప్రతినిధి సభ  సమావేశాలలో ప.పూ . సరసంఘచాలక్  మాననీయ మోహన్ జీ భాగవత్ చెప్పింది. )

Post a Comment

0 Comments