కారపు తిండి

కారపు తిండి

  గతంలో మా. సర్ కార్యవాహగా ఉన్న శ్రీ హొ.వె. శేషాద్రి జీ చనిపోయిన తర్వాత ఆయన గురించి ఒక పుస్తకం వచ్చింది. అందులో ఆయన గురించి శ్రీ న.కృష్ణప్ప గారు ఇలా వ్రాశారు:
     అది గత శతాబ్దపు యాభయ్యవ దశకం. అపుడు ప్రాంత ప్రచారక్ గా ఉన్న శ్రీ శేషాద్రి జీ కి అల్సర్ వ్యాధి ఉండేది. ఒక ఇంట్లో భోజనంలో విపరీతమైన కారం వేశారు. అయినా ఆయన ఆ భోజనం తిన్నారు. 
      ఆతర్వాత ఆయనకు విరేచనాలు మొదలయ్యాయి. వీరిద్దరూ పడుకున్నదేమో ఆ ఇంటి మేడ మీద. ప్రతి ఇరవై నిమిషాలకొకసారి క్రిందికి దిగి రావలసి వచ్చేది. రెండు మూడుసార్లు విరేచనాలయ్యాక,  శ్రీ శేషాద్రి గారు, శ్రీ కృష్ణప్ప గారితో  ' ఈ ఇంటివారికి ఇబ్బంది కలిగించడం వద్దు. ఊరి బయట ఉన్న కాల్వ పక్కన పడుకుందాం ' అని చెప్పి, ఇంటివారికి తెలియకుండా బయటకొచ్చారు. అప్పటినుండి తెల్లారేలోపు 15 -20 సార్లు విరేచనాలయ్యాయి. కాల్వలోనే స్నానం చేసి ఇంటికి వచ్చారు. అయితే ఆ ఇంటివారికి ఏమీ చెప్పలేదు. అన్ని వ్యవస్థలను పొగిడి వెళ్ళిపోయారు. తీవ్రమైన అనారోగ్యంఉన్నా, విపరీతమైన కారం వేసి భోజనం పెట్టినా, ఆరోగ్యం దెబ్బతిన్నా ఒక్కమాట కూడా మాట్లాడకుండా దాన్ని సహించారు శ్రీ శేషాద్రి జీ. 

                    - సంఘ సంపద బ్లాగ్


Post a Comment

0 Comments