ఉన్నాడు.
ఎక్కడ?
విశ్వమంతా!
కనిపించడెందుకు?
ఇంట్లోకి పోయి ఉప్పు తీసుకురా?
తెచ్చాను.
నీళ్లు తీసుకురా!
తెచ్చాను.
రెండు కలుపు.
కలిపాను.
ఉప్పు చూపించు.
కనబడట్లేదు.
ఉప్పు తీచ్చి నీటిలో కలిపావ్ కదా! ఏమైంది?
కరిగిపోయింది.
మరి ఉప్పు ఉందా!
లేదు.
లేదా?
అవును లేదు.
నీళ్ళల్లో వేశావ్ గా!
వేశాను కానీ కరిగిపోయింది.
కరిగిపోతే లేనట్లేనా!
కాదు. ఉంది.
ఆయితే నాకు చూపించు.
చూపడం కుదరదు.
ఏ?
కనబడటం లేదు.
ఇప్పుడు ఒకపని చెయ్. నాలికతో నీటిని తాకి చూడు.
ఉప్పగా ఉన్నాయి.
అందులో ఉప్పు ఉందా!
ఉంది.
ఒక ఇంద్రియానికి కనబడలేదు. తెలియదు అంటే లేనట్లేనా?
కాదు.
అయితే నాకు చూపించు.
మీరు కూడా రుచి చూసి తెలుసుకోవలసిందే.
కదా!....
అలానే భగవంతుడు కంటికి కనబడలేదని లేడు అనకు. ఉన్నాడు.
నాలుకతో నీటిని రుచిచూసి ఉప్పు ఎలా ఉందని చెప్పావో! సద్గురువుని ఆశ్రయించి ఆయన చెప్పిన రీతిలో కొన్ని సాధనలు చేసి అనుభూతి చెందాలి కంటికి కనబడితేనే ఉన్నాడు అనుకోవడం తప్పు.

0 Comments