కాటుకను కళ్ళకు పెట్టుకుంటె అందం, కాదని ఒంటికంతా పూసుకుంటే ! ?
ఒక విధంగా భాష, బ్రతుకు వేర్వేరు కాదు. ఒక ప్రదేశంలో జీవించేవారి జీవన ప్రతిబింబమే , వారి భాష. ముఖం వేరు, ప్రతిబింబం వేరే కావడం సాధ్యం కాదు. ప్రతిబింబాన్ని మార్చాలనుకుంటే, మూల వస్తువునే మార్చాల్సిఉంటుంది. నేడు మన మాతృభాషకు బదులు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలనుకునేవారు కోరుకుంటున్నది అదే. మన ప్రాచీన జీవన నిష్ఠ , ఆదర్శాలను చూస్తే నొసలు చిట్లించేవారు వీరు. రాజకీయ స్వార్థం కోసం ఆంగ్లాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అయితే అలాంటివారి వ్యతిరేకతను దేశజీవన ప్రవాహం కాలక్రమంలో కొట్టుకుపోయేలా చేస్తుంది. వేలాది సంవత్సరాల జీవన ప్రవాహాన్ని అడ్డుకుని , వ్యతిరేక దిశలో దానిని ప్రవహింపజేసే పిచ్చి సాహసం అది. భూగర్భంలో తన వేర్లను జొప్పించిన చెట్టులో , మరొక రకమైన పూలు, పండ్లు కాసేలా చేసే హాస్యాస్పద ప్రయత్నమది !
- హొ.వె. శేషాద్రి జీ
0 Comments