ఎటువంటి మనో నిగ్రహశక్తి కలిగి ఉండాలి - bruyat

 


డాక్టర్ జీ మనో నిగ్రహశక్తి గురించి తెలుసుకుందాం.

డాక్టర్ జీ కి మనోనిగ్రహశక్తి ఎక్కువగా ఉండేది. ఒక నాడు కాశీలో శ్రీ బాబూరావ్ దామలే గారు డాక్టర్జీ ని భంగు త్రాగమని బలవంతపెట్టారు. సంఘం ప్రారంభించినప్పటి నుండి డాక్టర్ జీ తమ స్వభావాన్ని మార్చుకున్నారు. అందుచేతనే వారి కిష్టం లేనప్పటికీ ప్రతిరోజు అనేక సార్లు టీ తీసుకోవలసి వస్తుండేది. అప్పటికి ఎన్నడూ డాక్టర్ జీ భంగు త్రాగి ఎరుగరు. డాక్టర్ జీ నిరాకరించిన కొలది భాబూరావ్ జీ ఎక్కువగా బలవంతపెట్టడం ప్రారంభించారు. డాక్టర్ జీ కి ఘాటైన భంగునిచ్చి దాని పరిణామాన్ని చూచి ఆనందించాలని ఉద్దేశమే వారి పట్టుదలకు కారణం.

చివరకు డాక్టర్ జీ వారి మాటను త్రోసివేయలేక వారితోపాటు భంగు త్రాగవలసి వచ్చింది. భంగు త్రాగే అలవాటున్న వారికే నిషా ఎక్కుతుంది అలాంటిది అలవాటు లేనివారి విషయం చెప్పనవసరం లేదు. డాక్టర్ జీ ఆ పగలంతా తమ కార్యక్రమాలలో యధావిధిగా పాల్గొన్నారు భంగు ప్రభావము వారిపై కించిత్తుకూడా లేకపోవటం చూచి అంతా ఆశ్చర్యపడ్డారు. దానికి కారణం వారి మనోనిగ్రగహళక్తి. --శ్రీ బాబాసాహబ్ ఆప్టే

Post a Comment

0 Comments