రామ‌ మనోహర్ లోహియా ప్రశ్న కు పూజ్య రజ్జుబయ్యా సమాదానం - Bruyat

ఒకసారి ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు డా౹౹రామ మనోహర్ లోహియా తనకు క్రొత్తగా పరిచయమైన ప్రొ౹౹రాజేంద్రసింహజీని అడిగారు.."మీరు యూనివర్సిటీలో ఏమి బోధిస్తారు? హిందీయా, సంస్కృతమా?"

"రెండూ కాదు, నేను ఫిజిక్స్ బోధిస్తాను" అన్నారు రాజేంద్రసింహజీ.

"ఏమిటీ? మీ సంఘం (ఆర్.ఎస్.ఎస్.)లో సైన్సు చదివినవారుకూడా ఉన్నారా?" ఆశ్చర్యం వ్యక్తపరిచారు లోహియా.

"సంఘ సంస్థాపకులు ఎం బి బి ఎస్ కి సమానమైన ఎల్. ఎమ్ & ఎస్ ఉత్తీర్ణులు. రెండవ సర్ సంఘచాలక్ శ్రీ గురూజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ లో జంతుశాస్త్రం బోధించారు. మన ప్రాంత సంఘచాలక్ బారిష్టర్ నరేంద్రజిత్ సింగ్ గణితంలో ఉద్దండులు..." అంటూ మరికొన్ని ఉదాహరణలు చెప్పబోతుంటే ఆపి,

 " సైన్సు తెలిసినవారు ఇంతమంది సంఘంలో ఉన్నారంటే సంఘసిద్ధాంతం సైంటిఫిక్ అయినదే అయిఉండాలి" అంటూ హర్షామోదాలు ప్రకటించారు డా౹౹లోహియా.

Post a Comment

0 Comments