Thought Giver - dattopant thengadi inspirational stories in telugu - bruyat

Thought Giver
1972 అక్టోబర్ 29 నుండి నవంబర్ 2 వరకు పుణె లో వివిధక్షేత్ర కార్యకర్తల సమావేశాలు జరిగాయి. అందులో ప.పూ. శ్రీ గురూజీ మాట్లాడారు. హిందూ అనే పదం ఉపయోగించకుండా చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు గురించి ఆయన ప్రస్తావించారు. అ తర్వాతి రోజున ఐరోపాలో పుట్టిన ఫేబియన్ సోషలిజం, సిండికెలిజం, కమ్యూనిజం లాంటి ఆలోచనా విధానాలపైన మాట్లాడారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ప.పూ.శ్రీ గురూజీ , ' దత్తోపంత్! ఇప్పటివరకు నేను చెప్పింది సరిగానే ఉందికదా? అనడిగారు. అందుకు సమాధానమిస్తూ శ్రీ ఠేంగ్డేజీ ' మన దగ్గర వివాహ ఆహ్వానపత్రం పెట్టిన కవరు మీద చిరునామాలు మారుతాయేగానీ ఆహ్వానపత్రం మీది విషయం ( వరుడు,వధువు ఎవరన్నది ) మారదు. కానీ వాళ్ళ దగ్గర మాత్రం పైన వ్రాసే చిరునామాతో బాటు లోపలి విషయమూ మారిపోతుంది ' అన్నారు. ఈ సమాధానం విని గట్టిగా నవ్విన ప.పూ.శ్రీ గురూజీ ' దత్తోపంత్ మనలో ఆలోచనలు రేకెత్తిస్తారు' ( Thought Giver ) అన్నారు.

Post a Comment

0 Comments