బందా బైరాగి - కమ్యూనిజం - thengadi inspirational rss leader - bruyat

బందా బైరాగి - కమ్యూనిజం
ఒకసారి శ్రీ దత్తోపంత్ ఠేంగ్డేజీ , శ్రీ గురుదయాళ్ సింగ్ డిల్లో ను కలిశారు. ఆయన ఠేంగ్డేజీతో ,నేను సంఘం గురించి బాగా తెలుసుకున్నాను. మీ కార్యక్రమాలు కూడా చూస్తుంటాను. మీ బౌద్దిక్ లను కూడా నేను చదివాను. మీ సిద్ధాంతం బాగానే ఉంది. అయితే ఈ సిద్ధాంతాన్ని ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మీరు సరైన రీతిలో ప్రస్తావించరెందుకు ? అన్నారు. అపుడు ఠేంగ్డేజీ ,ఆ ప్రయత్నం జరుగుతూనే ఉంది. నేను మీ మాటలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అన్నారు. అందుకు శ్రీ గురుదయాళ్ సింగ్ డిల్లో , చూడండి! ఉదాహరణ కొరకు చెబుతాను. మీ బౌద్ధిక్ లలో ఫతేసింగ్, జొరావర్ సింగ్ ల ఆత్మ బలిదానం గురించి వివరిస్తుంటారు. అది మంచిదే. దాన్ని చెప్పాల్సిందే.అయితే దానితో బాటు ఐరోపాలో కమ్యూనిజం అనే ఆలోచన పుట్టకముందే, మన పంజాబ్ లో బందాబైరాగి , భూమిలేని కార్మికులకు భూమిని పంచిపెట్టాడు. He redistributed land among landless labourers. దీన్ని గురించి చెప్పడంవల్ల మరింత ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నారు. వాస్తవంగా ఈ విషయం శ్రీ దత్తోపంత్ ఠేంగ్డేజీకి అప్పటివరకూ తెలియనే తెలియదు.

Post a Comment

0 Comments