ద్రష్ట
ఎన్నికల బహిరంగ సభలలో ప్రచారం నిమిత్తం శ్రీ దత్తోపంత్ జీ కేరళలో పర్యటించారు. కోజికోడ్ లోని ముథాల్ క్కులం ( Muthalkkulam ) మైదానం లో ఆయన ఉపన్యాసం నేనెప్పటికీ మరచిపోలేను.జనసంఘ్ మొదటిసారిగాఎన్నికలలో పోటీపడుతోంది. కాంగ్రెస్ మరియు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రముఖ పోటీదారులు. కమ్యూనిస్టులు చాలా తీవ్రస్థాయిలో ఎన్నికలను ఎదుర్కొంటూ ఆ రంగంలో నవశిశువైన జనసంఘ్ ను అవహేళన చేయడం మొదలెట్టారు. కమ్యూనిస్టులకు హెచ్చరికలు చేస్తూ , భవిష్యత్తులో ముసలిదైన మరియు అవినీతితో నిండిన కాంగ్రెస్ కు బదులుగా ఆదర్శవాదులైన మరియు శక్తిశాలురైన జనసంఘ్ కార్యకర్తలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జాతీయస్థాయి కమ్యూనిస్టు పార్టీ కుంచించుకుపోయి బెంగాల్ లో, కేరళలో ప్రాంతీయ పార్టీగా తయారైంది. ఒకవైపు అది బంగాళాఖాతంలోను, మరోవైపు అరేబియా సముద్రంలోను పడిపోవడానికి ఒక మంచి కిక్ ( kick ) చాలు అన్నారాయన. ఆ సమయానికి ఆ మాట అవ్యవహారికంగా అన్పించినా , ఈనాడు అది నిజమే అనిపించే అనుభవం కలుగుతోంది. శ్రీ దత్తోపంత్ జీ ఒక ద్రష్ట అనే భావనా కలుగుతోంది.
0 Comments