మనమంతా పిచ్చోళ్ళమే.
1987 డిశంబర్ 26- 28 తేదీలలో బిఎంఎస్ అఖిల భారతీయ సమావేశాలు బెంగళూరు లో జరిగాయి.బిఎంఎస్ కార్యకర్తలకు మార్గదర్శనం చేయడానికి అప్పటి ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ శ్రీ హొ.వె.శేషాద్రి జీ వచ్చారు. ఆయన ఉపన్యాసానికి ముందు, ఆయనను పరిచయం చేయడానికి ఒక కార్యకర్త వేదిక మీదకు రాగా శ్రీ దత్తోపంత్ జీ ,అతడిని ఆపి,నేను పరిచయం చేస్తాను అన్నారు. కార్యకర్తలనుద్దేశించి ,స్వాతంత్ర్యం రాకముందు దేశం కోసం తమకున్నదంతా సమర్పణ చేయాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది.అయితే నేడు దేశం స్వతంత్రమైంది కాబట్టి అలాంటి పిచ్చోళ్ళు నేడు లేరు. తెలివిగలవాళ్ళంతా తమకు, తమ కుటుంబానికి ఏదో ఒకటి సంపాదించాలని తమ జీవితమంతా ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో కూడా భారతదేశంలో ఒక పరిశ్రమ ( ఫ్యాక్టరీ ) నడుస్తోంది. అది దేశం కోసం అవసరమైతే అన్నింటినీ వదిలిపెట్టేయగల పిచ్చోళ్ళను తయారుచేస్తోంది.అక్కడ తయారైన పిచ్చోళ్ళు , భారతమాత కోసం తమ ప్రాణం, జీవితం తమ చదువు మొదలగు వాటన్నింటిని తృణప్రాయంగా వదలిపెట్టగలరు. అలాంటి పిచ్చోళ్ళను తయారుచేసే ఫ్యాక్టరీకి డిప్యూటీ డైరెక్టర్ , సంఘ భాషలోనైతే సహ సర్ కార్యవాహ అని పిలవబడే వ్యక్తి మనమధ్య ఉన్నారు అన్నారు. ఈ పరిచయ వాక్యాలు విన్న కార్యకర్తలంతా చాలాసేపు చప్పట్లు మారుమ్రోగించారు. ఆ తర్వాత ఉపన్యసించడానికి లేచిన శ్రీ శేషాద్రి జీ , ఈ రోజు నా అసలైన పరిచయాన్ని విని చాలా అనందపడుతున్నాను. నేను స్వయంగా పిచ్చోణ్ణి కావడంతోబాటు, నా అసలు పరిచయం తెలుసుకుని, నవ్వినవాళ్ళంతా కూడా పిచ్చోళ్ళే కావడం, చప్పట్లు కొట్టి నన్ను స్వాగతించినవాళ్ళూ పిచ్చోళ్ళే కావడం నాకు మరింత సంతోషాన్నిస్తోంది. ఒక మంచి సుసందర్భంలో ఒక పిచ్చోడు అనేకమంది పిచ్చోళ్ళ సభలో పాల్గొనడం మరింత సౌభాగ్యంగా భావిస్తున్నాను అన్నారు.
0 Comments