ఆధునిక చాణక్యుడు శ్రీ దత్తోపంత్ జీ - dattopant inspirational stories in telugu - bruyat

ఆధునిక చాణక్యుడు శ్రీ దత్తోపంత్ జీ
హరిద్వార్ లోని భోపత్ వాలా లో ఉండెద నిష్కామ సేవా ట్రస్ట్ లో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశానికి అన్ని సంప్రదాయాలకు చెందిన సాధుసంతులు , పీఠాధిపతులు హాజరయ్యారు. సమావేశంలో శ్రీ దత్తోపంత్ జీ ఉపన్యాసం.ఆయన మాట్లాడుతూ ,ఆధునికంగా ఉండటం అనేది భిన్నమైన విషయం.మనం పాశ్చాత్యీకరణాన్నే ఆధునికీకరణంగా భావిస్తున్నాము. అయితే అది ఆధునికీకరణం కాదు అని ఉదహరణల సహితంగా వివరించారు.అది శ్రద్ధగా విన్న సాధుసంతులంతా మేము చాణక్యుడిని గతంలో చూడలేదు కానీ నేడు చూస్తున్నాము అన్నారు.
శ్రీ దత్తోపంత్ జీ తమ చివరి రోజుల్లోనూ ఫుట్ పాత్ మీద ఉండే గుమటి (Kiosk )( కార్మికులు టీ త్రాగే చిన్న దుకాణం )ల్లోకి వెళ్ళి టీ త్రాగేవారు. ఆయన12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా, టీ మాత్రం గుమటిల్లోనే త్రాగేవారు. ఒకసారి నేను ట్రినిడాడ్ కు వెళ్ళి ఒక ఇంట్లో విడిది చేశాను. అ ఇంట్లో గతంలో శ్రీ అశోక్ సింఘల్, శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే శ్రీ నరేంద్ర మోడి లాంటి వారు విడిది చేశారని తెలిసింది. ఆ ఇంటివారు చెప్పిన ప్రకారం అయితే దత్తోపంత్ జీ అక్కడ కూడా కార్మికులు టీ త్రాగే దుకాణాలను వెతుక్కుని వెళ్ళి , టీ త్రాగి వచ్చేవారు.విదేశాలలోని కార్మికుల మనసును వారి కష్టాలను అర్థం చేసుకునేందుకు అయన అలా చేసేవారు.
- స్వామి అవధేశానందగిరి
హరిద్వార్

Post a Comment

0 Comments