వందేమాతరం మనదే జయభారతం vandemataram manade jayabharatam - rss geeth in telugu

వందేమాతరం మనదే జయభారతం
తరం తరం గుండెల్లో నిరంతరం ధ్వనియించును
వందేమాతరం వందేమాతరం ||వందేమాతరం||
స్వర్గసీమ కన్న మిన్న జననీ జన్మభూమి యన్న
రఘు రాముని దేశభక్తి ఎద ఎదలో రగులుతుంటే
పరధర్మం భీకరమని స్వధర్మం శ్రేయమ్మని
శ్రీకృష్ణుడు గీత బోధ మన మత్తును వదిలించు ||వందేమాతరం||
వికృతులను రూపుమాపిన హిందూ ధర్మ ఘనత నిలుపు
ఆదిశంకరుని తత్త్వం ఆచరణకు నోచుకొనగ
జనశక్తిని జతగూరిచి యవన మూక నోడించిన
చాణక్యుని ధ్యేయ నిష్ఠ నరనరాన ఉప్పొంగగ ||వందేమాతరం||
మావళీల మనసులు గెలిచి మతమౌఢ్యుల మదమణిచిన
శివరాయుని జయపథమున వడివడిగా అడుగులేస్తే
భువిజనులకు శుభకరమౌ హిందుత్వమే పునాదిగా
నవభారత నిర్మితికై నరేంద్రులై కదలిరాగ ||వందేమాతరం||
సమర భేరి మోగించిన నేతాజీ అల్లూరి
భారతి బంగరు భవితకు బాట చూపే డాక్టరీ
జాతికొరకు జ్వలియించి జననికి ముదమును గూర్చిన
వేనవేల త్యాగధనుల ఆత్మ మనలో నావహించు. ||వందేమాతరం||

Post a Comment

0 Comments