తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా - tarataraala charitra pilupidi - rss geeth in telugu

తరతరాల చరిత్ర పిలుపిది మరువబోకుము సోదరా
నర నరాన స్వదేశ భక్తియె పరుగులెత్తగ నిమ్మురా!! || తరతరాల||

రామ రాజ్యం ధర్మరాజ్యము, సకల జన సుఖశాంతి మూలము
దివ్య జీవన మొసగు రాజ్యం, దేశ ప్రజలకు తెల్పునేమన
రాక్షసత్వం రూపుమాపుట, లక్ష్యంగా గ్రహియింపదగునని || తరతరాల||

శరధి గట్టిన మానవేంద్రుడు, స్వర్ణలంకను గొన్న వీరుడు
దాశరథి శ్రీరామచంద్రుని, చరిత దెలిపెడి సారమేమన
జన్మభూమికి స్వర్గమైనను, సాటిరాదని చాటినాడని || తరతరాల||

సింధు నది తీరాన యవనులు, హిందూ వీరుల ఖడ్గధాటికి
కదన భూమిని వదిలి పారిన, కథలు తెలిపెడి సారమేమన
క్షాత్ర వీర్యం బ్రహ్మ తేజం, కలిసి యుండిన కలదు జయమని || తరతరాల||

అడవులే ఆశ్రయములైనను, ఆకులలము అన్నమైనను
మొగలు పాదుషా గుండెలదరగ, జీవితాంతం పోరుసల్పిన
వీర రాణ తెల్పునేమని, జాతి శ్రేయమె ధ్యేయమౌనని ||తరతరాల||

ఆలయములు ఆలమందలు, ఆడబిడ్డల కొరకు పోరిన
ఆర్త హిందూ స్పూర్తి కేంద్రము, ఛత్రపతి బోధించునేమని
హైందవం ఈ దేశ జీవం, అంత్య విజయం మనదే యౌనని ||తరతరాల||

Post a Comment

0 Comments