ఒకే రక్త మొకే జాతి ఒకే లక్ష్యమందరిదీ - oke rakta moke jati - rss geeth in telugu

ఒకే రక్త మొకే జాతి ఒకే లక్ష్యమందరిదీ
ఒకే బాట ఒకే పాట ఒకే ధర్మమందరిదీ
హిందుత్వం మన ధర్మం గుండె గుండేకనుబంధం
మానవులను శ్రేష్ఠులు గా మలచు దివ్య సాధనం!!

సర్వపంథ సమభావన ఏకసత్య ప్రతిపాదన
సకల జగత్ విష్ణుమయం సమర్పించు నీ హృదయం
అని తెలిపెను హిందుత్వం ఇది మన కనుసరణీయం
హితవులేని జడవాదపు నినాదాలు ఇజాలేల || ఒకే రక్త||

ఒరులేయవి ఒనరించిన అప్రియములు తనకగునో
ఒరులకు అవి చేయకునికి పరమధర్మమని ఎరిగి
వేదవాక్కు శాంతి గీతి విస్మరింపబోకురా
ధర్మ పథము ననుసరించి జనతను నడిపింపరా || ఒకే రక్త||

కలసి ఉంటే కలిసి తింటే కలిసి మెలిసి అడుగు లేస్తు
పౌరుషము పెంచుకుంటూ ప్రగతిని సాధించుదాం
అవినీతి కులతత్వం అంటరానితనం త్రుంచి
అన్నదమ్ములందరికీ ఆత్మీయత పంచుదాం || ఒకే రక్త||

Post a Comment

0 Comments