కణ కణమున కంఠమిదే - kana kanamuna kantamide - rss geeth

కణ కణమున కంఠమిదే-అణువణువున నాదమిదే
మాతృభూమి మనలచూచి-కోరుచున్న కోర్కెయిదే ||కణ||
బీదరికం బాధలతో-బాధామయ గాధలతో
ఆత్మన్యూనత భావం తో-అలమటించు జాతిలోన
సామాజిక సమరసత-స్వాభిమానం సంపూర్ణత
సాధించగా రారమ్మని-మాతృభూమి పిలుపు యిదే ||కణ||
విలాసాలు విడిచిపెట్టి-కులాసా కట్టి పెట్టి
వీర వ్రతం స్వీకరించి-ధ్యేయ నిష్ఠ దీక్షబూని
సంఘటనా సూత్రముతో-ధర్మరక్ష లక్ష్యమును
సాధించగా రారమ్మని-మాతృభూమి పిలుపుయిదే ||కణ||
విశ్వ శాంతి సందేశం-వినిపించిన ఈ దేశం
విదేశీయ వాదంతో-విధర్మీయ వికృతితో
విచ్ఛిన్నం కాకముందే-హిందుత్వం కాపాడగ
విక్రమించ రారమ్మని-మాతృభూమి పిలుపు ఇదే  ||కణ||

Post a Comment

0 Comments