జన జాగృత నవభారత మహోదయం - janajagruta navabhaarata mahodayam - rss geeth in telugu

జన జాగృత నవభారత మహోదయం
ఈ కనులతోనే కాంచుదాం
ఈ జీవితమున సాధించుదాం           || జన||
ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త
నరనరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన||

మన పూర్వులు మహనీయుల స్మరియించి
మన సంస్కృతి మహోన్నతుని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతి శిరమెత్తి నిలచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన||

ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతులు బలహీనత లావరించే
అందరమొకటిగ నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన||

నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృతపరచి ఎదఎదలో శక్తి నింపి
జాతీని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన||

Post a Comment

0 Comments