శరీరం ఒక సాధనం

68. శరీరం ఒక సాధనం:  మన వైఖరికి, పాశ్చాత్యుల వైఖరికి మౌలికమైన తేడా ఏమంటే వారు శరీరాన్ని, దానికోరికలను తీర్చడాన్ని లక్ష్యంగా భావించారు. మనం శరీరాన్ని మన లక్ష్యాల సాధనకు ఒక సాధనంగా భావిస్తాం. ఈదృష్టితోనే మనం శరీరంయొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించాం. మన శరీర అవసరాలను తీర్చాల్సిందే, కాని మన ప్రయత్నాలన్నింటికీ దీనినే ఏకైక
లక్ష్యంగా మనం భావించం. భారత్లో మనం మనిషియొక్క ఏకాత్మక పురోగతిని సాధించే దృష్టితో శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల అవసరాలను ఈడేర్చడానికై నాలుగువిధాల బాధ్యతల ఆదర్శాన్ని మనముందుంచుకున్నాం. ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనేవి చతుర్విధ మానవ పురుషార్థాలు. పురుషార్ధాలంటే మానవోచితమైన ప్రయత్నాలని అర్ధం. ధర్మార్ధకామమోక్షాలపట్ల ప్రగాఢకాంక్షలు మానవుడిలో జన్మసిద్ధంగా వున్నాయి. ఈ నాలుగు ప్రయత్నాల గురించి కూడా మనం ఏకాత్మకంగానే ఆలోచించాం. ఈ పురుషార్థాల్లో మోక్షాన్ని అత్యున్నతమైనదిగా పరిగణించినప్పటికీ మోక్షప్రయత్న మొక్కటే ఆత్మకు ప్రయోజనం చేకూర్చుతాయని భావించలేదు. కాకపోగా, ఏ వ్యక్తి కర్మఫలాలపట్ల అనాసక్తంగా వుంటూనే కర్మపరాయణడుగా వుంటాడో అతనికి మోక్షం అనివార్యంగా, ముందే సిద్ధిస్తుందని చెప్పబడింది.

Post a Comment

0 Comments