సంఘటన ప్రాముఖ్యత

11. పరిశిష్టం 66. సంఘటన ప్రాముఖ్యత: సంఘటన అంటే కలసి జీవించటమని అర్థం. అఖండమైన పరస్పరసహకార సూత్రమని అర్థం. ఏవ్యక్తి తనంత తానుగా ఏమీ చేయలేడు కనుక సహజంగా కూడా సంఘటన అవసరముంది. మీరు భౌతిక జీవితం గడిపినా, ఆధ్యాత్మిక జీవితం గడిపినా ఎందరి సహకారమో అవసరమవుతుంది. మేము స్వయంగానే ఫలానా పనిచేశామని మనం చెప్పవచ్చు కానీ కొంచెం ఆలోచిస్తే మనం చేసే ప్రతిపనివెనుకను, అలాంటి
ప్రతిపని యొక్క ఫలితం వెనుకను మన సోదరుల్లో ఎందరి హస్తమో ఉన్నదని గ్రహిస్తాం. కనుక ప్రతివ్యక్తి ఒక సంఘటిత సామాజిక జీవితంలో భాగం కావలసిందే. ఇది సహజం. ఇందులోనే సుఖసంతోషాలు, సుసంపన్నత, అభ్యుదయం వున్నాయి. సంఘటనలో శక్తివున్నది; ప్రపంచంలో దేనినైనాసరే సంపుటనద్వారా సాధించవచ్చు. సంవుటనలో గొప్ప తనమేమంటే అది పరిమితిలో పంచుతుంది. అయితే సంఘటన అంటే సమూహంకాదు. చాలామందికి ఈ రెండింటిమధ్య తేడా తెలియదు. సమూహానికీ సంఘటనకు మధ్య తేడా ఏమంటే సమూహంలో ప్రతివ్యక్తీ తాను ఒంటరినని భావించు కుంటాడు; ప్రతి వ్యక్తికీ తనదైన లక్ష్యము, ప్రయోజనము వుంటాయి. వారంతా ఒకరితో ఒకరు సంబంధంలేనివారు, అపరిచితులు. కార్యకలాపాలు జరుగుతూ వుండవచ్చు కాని అనుభూతి స్థాయిలో ఏకత్వం వుండదు. సంపుటన విషయంలో ఇలావుండదు. సంవుటనగా రూపొందినవారు సంఖ్యపరంగా చాలామంది వున్నప్పటికీ అందరం ఒకటేననే గుర్తింపుతో వుంటారు. వారి లక్ష్యం, వారి దీశ, వారి ఆలోచన - ఇవన్నీ ఒకటిగానే వుంటాయి; కనుక వారు సమాన ప్రయోజనం కలిగి వుంటారు. వారి చర్యలు వారందరి సంఖ్యకన్నా వేలరెట్ల శక్తిని ఉత్పాదన చేస్తాయి. ప్రతివ్యక్తికీ తనదైన వ్యక్తిత్వముంటుంది, అయినప్పటికీ వారు ఒకే విరాట్ వ్యక్తిత్వంలోని అవిభాజ్య భాగాలు. వారి విజయ రహస్యం ఇదే.

Post a Comment

0 Comments