సమాఖ్యవల్ల ప్రమాదాలు

57. సమాఖ్యవల్ల ప్రమాదాలు: భారత్ సర్వసత్తాక రాజ్యంగా ప్రకటించబడిందిగాని దాని సర్వసత్తాకత్వ పరిరక్షణకు తగినంత ఏర్పాట్లు జరగలేదు. దేశవ్యాప్తంగా ఒకే పౌరసత్వాన్ని నెలకొల్పడం ద్వారాను, కేంద్రానికి తగినంత అధికారాన్ని యివ్వటం ద్వారాను దేశ ఏకత్వాన్ని బలపరచేందుకు ఒక ప్రయత్నమైతే జరిగింది కాని దేశాన్ని విభిన్న రాష్ట్రాల సమాఖ్యగా , పరిగణించటంవల్ల ఈ ఏకత్వ పునాదికి గట్టిదెబ్బ తగిలింది. శరీరం వివిధ అవయవాల సమాహారం (Collection) కాదు; అవయవాలు శరీరం యొక్క అవిభాజ్యమైన భాగాలు. సమాఖ్య భావన భారతదేశపు ఐక్యతకు గొడ్డలిపెట్టు కావటం, జాతి వ్యతిరేక మనోభావాలు పెచ్చరిల్లటం ఖాయం. జాతీయ భావనలేమివల్ల అధికారం కోసం విభిన్న రాష్ట్రాలు సిగపట్లకు దిగుతాయి. భారత్ను సమాఖ్యగా భావించటం ఒక మౌలికమైన తప్పిదం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ప్రతిపాదన చేయటం తగదు.

Post a Comment

0 Comments