ఏక కేంద్రక రాజ్యం

8. రాజ్యం 56. ఏక కేంద్రక రాజ్యం - (Unitary State) ఏకకేంద్రక రాజ్యమంటే అత్యంత నిరంకుశ కేంద్రమని అర్ధంకాదు; అందులో ప్రాంతాలను(రాష్ట్రాలను) నిర్మూ లించటమూ వుండదు. ప్రాంతాలకు వివిధ కార్యనిర్వాహక అధికారాలుంటాయి. ప్రాంతాలకన్నా దిగువస్థాయిలో వుండే జనపదాలవంటి వివిధ భాగాలకు కూడా తగిన అది కారాలుంటాయి. పంచాయతీలకు కూడా అధి కారాలుండాలి. సాంప్రదాయికంగా పంచాయతీలకు చాలా ముఖ్యస్థానం వుండేది. పంచాయతీలను ఎవరూ రద్దు చేయగలిగేవారు కాదు. కాని ఈనాడు ఈ పంచాయతీలకు రాజ్యాంగంలో ఎలాంటి చోటులేదు. ఈ పంచాయతీలకు స్వతహాగా ఎలాంటి అధికారాలూ లేవు. వీటి అధికారాలు రాష్ట్రాల దయాభిక్షమీద ఆధారపడివున్నాయి. వీటి అధికారాలను ప్రాధమికమైనవిగా పరిగణించవలసిన అవసరముంది. ఈవిధంగా అధికార వికేంద్రీకరణ సాధించబడుతుంది. అధికారం అత్యంత దిగువస్థాయికి పంపిణీ చేయబడి పూర్తిగా వికేంద్రీకరణ చెందుతుంది. అదే సమయంలో ఈ అధికార వ్యక్తిత్వాలన్నీ ఏకకేంద్రక రాజ్యం (Unitary State) చుట్టూ చేరివుంటాయి.

Post a Comment

0 Comments