ధర్మం సర్వోన్నతం

5.ధర్మం సర్వోన్నతం: శాసనవ్యవస్థ గానీ, న్యాయవ్యవస్థ గానీ అత్యున్నతమైనవి అయినప్పటికి రెండింటికన్నా ధర్మం గొప్పది. అవి ధర్మ బద్ధంగా వ్యవహరించాలి. ఆ రెండింటి పరిమితులను ధర్మం నిర్ధారిస్తుంది. “ప్రజలదే సార్వభౌమ ప్రతిపత్తి. వారే ఎన్నుకుంటారు” అని కొందరనవచ్చు. కాని ధర్మానికి ప్రతికూలంగా వ్యవహరించే హక్కు ప్రజలకు లేనందున వారుకూడా సార్వభౌములుకారు. ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను ధర్మవిరుద్ధంగా వ్యవహరింపనిచ్చి వారిని శిక్షించకుంటే అది నిజానికి దొంగల ప్రభుత్వమే. జన సంకల్పం కూడా ధర్మవిరుద్ధంగా పోజాలదు. ఏదో విధంగా మాయలుచేసి ప్రభుత్వంలో దొంగలు ఆధిక్యత సంపాదించి తమలో ఒకరిని కార్యనిర్వాహకునిగా పంపితే పరిస్థితి ఏమిటో ఊహించండి.
అధిక సంఖ్యాకులు దొంగలై వారొక దొంగను పాలకుడిగా ఎన్నుకుంటే అల్ప సంఖ్యాకుల కర్తవ్యమేమిటి?

Post a Comment

0 Comments