యంత్రాన్ని ఎంపిక చేయటం

47. యంత్రాన్ని ఎంపిక చేయటం: యంత్రపు ఎంపిక తక్కిన అన్ని సాధనాలమీద ప్రభావాన్ని చూపిస్తుంది గనుక యంత్రాన్ని ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేయాలి. సరియైన యంత్రాన్ని మనం ఎంచుకుంటే శ్రామికుడు ఉత్పాదకుడు కాగలడు. లేకుంటే వినియోగదారుడిగానే మిగిలిపోతాడు. మొత్తంమీద మనం ఈ దేశంలో లభ్యమవు తున్న ఉత్పాదక సాధనాలకు అనుగుణంగా వుండే యంత్రాలనే ఉపయోగించుకోవాలని మాత్రం చెప్పవచ్చును. శ్రామికులు, పెట్టుబడి, యాజమాన్యం, సరుకు, డిమాండు - ఇవన్నీ మనం . ఉపయోగించే యంత్రాన్ని నిర్ణయించాలి. అవసరం. ఆవిష్కరణకు తల్లివంటిది అంటారు. కాని ఈనాడు మనం . యంత్రాన్నే ప్రధానమైనదిగా భావిస్తూ తక్కినవన్నీ దానికి అనుగుణంగా మారాలనుకుంటున్నాం. ఉత్పాదన వ్యవస్థ మొత్తం యంత్రం చుట్టూనే కేంద్రితమైంది. ఆవిష్కరణల అవసరాలను సృష్టిస్తున్నట్లుంది.

Post a Comment

0 Comments