యాంత్రికవాదంపై పోరాటం

5. యాంత్రికవాదం
45. యాంత్రికవాదంపై పోరాటం: పాశ్చాత్యుల యాంత్రికయుగాన్ని మనం గ్రుడ్డిగా అనుసరిసే | సర్వోదయంకాని, సోషలిజంకాని మన సంస్కృతిని కాపాడలేవు. మన యెదుటనున్న సమస్యలను పరిష్కరించుకోలేము కూడాను. ఈ యాంత్రికవాదంపై రాజకీయ, ఆర్థిక, సామాజిక, సైద్ధాంతిక రంగాలన్నింటిలో మనం పోరాడవలసివుంది. ధర్మరాజ్యం, ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం, ఆర్థిక వికేంద్రీకరణ అనేవే మన ఆదర్శాలుగా వుండాలి. వీటన్నిటి సమ్మేళనం మాత్రమే ఈనాటి తుఫానులన్నిటిమధ్య మనలను పరిరక్షించగల జీవన సిద్ధాంతాన్ని మనకు ఇవ్వగలుగుతుంది. హిందుత్వమనో, మానవతావాదమనో లేక మరేదైనా వాదమనో ఏపేరుతోనైనా మీరు దానిని వ్యవహరించవచ్చు - భారతదేశ ఆత్మకు అనుగుణంగావుండి ఈదేశప్రజానీకంలో ఒక నవీన ప్రాణశక్తిని పూరించగల ఏకైకమార్గమిది. ప్రస్తుతం అయోమయపు కూడలిలో నిలుచొనివున్న యావత్ ప్రపంచానికి కూడా బహుశా యిది మార్గదర్శనం నెరపవచ్చును కూడాను.

Post a Comment

0 Comments