కార్మిక ప్రధానమైన ఉత్పాదన ప్రక్రియ

42. కార్మిక ప్రధానమైన ఉత్పాదన ప్రక్రియ: భారతదేశంలో ఉత్పాదక సాధనాల గురించి మనం ఆలోచించినపుడు మన ఉత్పాదక ప్రక్రియ అత్యధిక కార్మిక ప్రధానమైనదిగానే వుండితీరాలనే గట్టి నిర్ధారణకు మనం వస్తాం. మొదటగా మనకు మూలధనం (పెట్టు బడి ) . తక్కువగావుంది. కార్మికులు తక్కువగావుండే పధకాల ప్రాతిపదికగా దీనిని స్థిరమూలధనం (fixed capital)గా మనం . మార్చుకున్నపుడు ఈ మూలధనం దేశంనుంచి బయటకు ప్రవహిస్తుంది. అంతేగాక మన పాత యంత్రాలు మూలనపడి దానివల్ల మూలధనం తరిగిపోవటం (decapitalisation), ఉద్యోగాలు పోవటం (disemployment) వేగంగా జరుగుతుంది. నిరుద్యోగం ప్రబలిపోయిన ఫలితంగా అత్యధికప్రజల జీవనప్రమాణం పెరగటానికి బదులు మాంద్యానికి గురవుతుంది. సంక్లిష్టమైన పాశ్చాత్య ఉత్పాదన ప్రక్రియ కొద్దిమందికి ఉపాధి కల్పించగలదు కాని దేశ ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుతీసుకురాగల చైతన్యశీల ప్రక్రియను అది ప్రారంభింపజాలదు. అలాంటి పారిశ్రామిక వ్యవస్థ మనకు కావాలంటే అది వ్యవసాయరంగానికి అనురూపంగా వుంటూ చిన్నతరహా పరిశ్రమలకు తగినంత ప్రాముఖ్యతనివ్వాలి.

Post a Comment

0 Comments