41. పెట్టుబడికి దోహదపడే ప్రాజెక్టులు (capital projects) చాలా సందర్భాలలో ప్రతిష్ఠకోసం పెట్టుబడికి తోడ్పడే పారిశ్రామిక పధకాలను చేపట్టడం జరుగుతున్నది. పెట్టుబడి వస్తువులను తిరిగి వస్తువుల తయారీకి ఉపయోగపడే వస్తువులు. ఉదా: యంత్రాలు) ఉత్పాదన చేసే సామర్థ్యంవల్ల ప్రపంచం దృష్టిలో మన గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయనే అభిప్రాయపడుతున్నారు. కాని ఇది ఆర్థిక సత్యంకాదు. అలాంటి పెట్టుబడి ఉత్పాదన కోసం మనం దీర్ఘకాలంపాటు మన జీవన ప్రమాణాన్ని తక్కువస్థాయిలో ఉంచుకో వలసి రావటం మాత్రమేగాక రాజకీయరంగంలో ప్రజాస్వామిక సూత్రాలకు తిలోదకాలు ఇవ్వవలసివుంటుంది కూడాను.
0 Comments