40. పట్టణీకరణ ఫలితాలు: పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థ ప్రకారం పట్టణీకరణ స్థాయిని అభివృద్ధి ప్రాతిపదికగా పరిగణిస్తారు. భారతదేశంలోనూ మహానగరాల సంఖ్య, వాటి జనాభా రానురాను పెరిగి పోతున్నాయి. పాశ్చాత్య జీవితంలో నగరాలు ఎన్నో సామాజిక, నైతిక, రాజకీయ, ఆరోగ్య సమస్యలను సృష్టించాయి. వాటికోసం భారీగా ధనవ్యయం చేస్తున్నారు. భారతదేశపు శీతోష్ణ పరిస్థితుల్లో ఎక్కువ జనం సమ్మర్ధంగాచేరి నివసించటం మనకు మరింత హానికరమైనది. టీ.బీ., వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి పోవటానికి ఇదొక ముఖ్యకారణం. మన నగరాల్లో మురికివాడలు కూడా పెరిగి పోతున్నాయి. కనుక ఇప్పుడు కావలసింది క్రొత్త పట్టణాలు కాదు. గ్రామాల పారిశ్రామికీకరణ కావాలి.
0 Comments