ఆహారము - స్వేచ్ఛ

36. ఆహారము - స్వేచ్ఛ: మన ప్రస్తుత ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి దిగుమతులు తోడ్పడవచ్చేమోగాని దేశంలో వ్యావసాయిక ఉత్పాదనను గరిష్టస్థాయికి పెంచుకోవడంలోనే సమస్యకు అసలైన పరిష్కారముంది. ఈ దిశగా మనం చేసింది ఏమంత లేదనే విషయం చెప్పవలసినపనిలేదు. కాలంగడుస్తున్నకొద్దీ మనం విదేశీ వనరులమీద ఆధారపడటం ఎక్కువై పోతున్నది. ప్రస్తుతం ఆహారం పుష్కలంగా లభిస్తున్నందున స్థానికంగా ఉత్పాదనను పెంచే ప్రయత్నాలలో ప్రభుత్వం అలసత్వం వహించరాదు. కాని మన స్వేచ్ఛ, మన ఆహారమే మనకు కావాలి. “విదేశీ ఆహారం నుంచి స్వేచ్ఛ” అనే నినాదాన్ని మళ్ళీ మనం ఎతుకుంటేనే అది సాధ్యపడుతుంది. విదేశీవనరులమీద ఆధారపడటం మనలను దరిదుకు చేసి బంధనాల్లో చిక్కుపడేలా చేస్తుంది.

Post a Comment

0 Comments