33. యాజమాన్య హక్కు యాజమాన్యహక్కు అనేది వాస్తవానికి ఒకానొకదానిని నిర్దిష్ట పరిమితులకులోబడి నిర్దిష్ట ప్రయోజనంకోసం వినియోగించుకునే హక్కు ఈ హక్కులు కాలానుగుణ్యంగా మారుతుంటాయి. కనుక సూత్రప్రాయంగా మనం వ్యక్తిగతహక్కులకు, సమాజపు హక్కుకు మధ్య వివాదాలలో చిక్కుకోకపోవచ్చు. మన దృష్టిలో రాజ్యం మాత్రమే సమాజంయొక్క రూపం కాద వ్యక్తి, కుటుంబం, సమూహం, రాజ్యం - ఇవన్నీ సమాజం తనను తాను అభివ్యక్తం తీసుకొనిసాఫల్యతచెందే విభిన్నరూపాలని మనం విశ్వసిస్తాం. మనదేశంలో ఉమ్మడికుటుంబం ఒక ఆచరణాత్మక యూనిట్గా మనం వ్యక్తితో సామాజిక వివేచనను పరిరక్షించడానికి యత్నిస్తున్నాం; ఇందులో ప్రతి వ్యక్తికీ చంపాదించేహక్కు వుంటుంది, కాని యాజమాన్యం మాత్రం కుటుంబానికే దఖలుపడివుంటుంది. సంపదను కుటుంబ ప్రయోజనానికే వినియోగించటం జరుగుతుంది. ఈ భారతీయ ధర్మకర్తృత్వ సూత్రాన్నే గాంధీజీ గురూజీ తదితర ఆలోచనాపరులు ప్రతిపాధించారు.
0 Comments