ఏ హక్కూ శాశ్వతం కాదు

32. ఏ హక్కూ శాశ్వతం కాదు: ఆస్తికి సంబంధించినవిగానీ, ఇతరమైనవిగానీ ఏ ప్రాధమిక హక్కులూ శాశ్వతమైనవికావు. అవన్నీ సమాజ ప్రయోజనం మీద ఆధారపడి వుంటాయి. నిజానికి వ్యక్తి తన సామాజిక విధులను నిర్వర్తించగలగడానికే ఈ హక్కులు అతనికి ఇవ్వటం జరిగింది. సమాజాన్ని రక్షించడం సైనికుడి విధి కనుక అతనికి ఆయుధాలిస్తారు. అతను తన విధ్యుక్త ధర్మాన్ని పాటించకుంటే ఆయుధాలు ధరించే హక్కును కోల్పోతాడు. అదే విధంగా సమాజంపట్ల వ్యక్తి తన విధిని నిర్వర్తించ గలిగేటందుకే అతనికి ఆస్తిహక్కు ఇవ్వబడింది. ఇందుకుగాను ఈ హక్కులను కాలానుగుణ్యంగా నిర్వచించటం, సవరణ చేయటం అవసర మవుతుంటుంది. ఆస్తి హక్కు ఏదీ సమాజ నిరపేక్షమైనది కాదు.

Post a Comment

0 Comments