భారత్ మన తల్లి

27. భారత్ మన తల్లి: కేవలం భారత్ కాదు. 'భారత మాత' మన జాతీయ వాదానికి భూమిక, మాత అనే పదం తొలగిస్తే భారత్ భూఖండంగా మిగులుతుంది. ఒక భూఖండానికి, దానిలో నివసించే ప్రజానీకానికి మధ్య తల్లీ, బిడ్డల సంబంధం వుండనంతవరకు దానినొక దేశంగా వ్యవహరించలేము. అయితే కేవలమొక భూఖండాన్ని ప్రేమించటమే దేశభక్తి అనిపించుకోదు. ఇలాంటి ప్రేమ అయితే పశుపక్ష్యాదులకు కూడా వుంటుంది. పులి తన పొదలో నివసిస్తుంది, పక్షులు ప్రతి సాయంత్రానికి తమ గూళ్ళకు చేరుకుంటాయి. కాని వాటిని దేశభక్తులనలేం, మనిషి కూడా తాను నివసించే ప్రదేశం పట్ల అభిమానం పెంచుకోవచ్చు. కాని దేశభక్తికి అది చాలదు. ఒకానొక దేశంలో ఒకే ప్రజగా పరస్పర అనుబంధం కలిగివుండే వారినే దేశభక్తులంటారు. ఒక భూఖండమంతా కలసి తల్లియై, ఒక ఏకాత్మతగల సమాజం పుత్రుడైతే దేశం సృష్టించ బడుతుంది. ఇదీ దేశభక్తి అంటే. ఇది అమరమైనది.

Post a Comment

0 Comments